బైడెన్‌ ని అధ్యక్షుడిగా గుర్తించను : పుతిన్‌ సంచలనం

-

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన విషయాల మీద ఇప్పటివరకు వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రపంచ దేశాధినేతలు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం, రష్యా, చైనా దేశాలు మాత్రమే సరిగా స్పందించలేదు.  చైనా కూడా బైడెన్ ఎన్నికపై శుభాకాంక్షలు తెలిపింది. కానీ, పుతిన్‌ మాత్రం అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ను గుర్తించేందుకు సిద్ధంగా లేనని తాజాగా ప్రకటించారు.

అయితే ఎవరి నాయకత్వం అయినా అమెరికాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్న ఆయన ఆయన ప్రతిపక్ష పార్టీ గుర్తించిన వ్యక్తి లేదా చట్టపరమైన మార్గంలో ఫలితాలు వచ్చాకనే వారు తమ దృష్టిలో అధ్యక్షుడు అవుతారని పేర్కొన్నారు. . బైడెన్‌ను అభినందించకూడదని క్రెమ్లిన్‌ నిర్ణయం తీసుకుందని అయితే ఇన్దులో ఎలాంటి ఉద్దేశాలు లేవని పుతిన్‌ పేర్కొన్నారు. అయితే ఈ కామెంట్ అమెరికా-రష్యా సంబంధాలను దెబ్బతీస్తుందా? అనియా దాగగా  ‘దెబ్బతినడానికి ఏమీ లేవు, అవి ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నాడు. 

Read more RELATED
Recommended to you

Latest news