పీక్‌ స్టేజ్‌కు గ్రేటర్ ఎన్నికల వేడి..ఎంఐఎం ఎమ్మెల్యే మాటల వెనక ఆంతర్యమేంటి?

-

ఎన్నికల తేది దగ్గర పడుతున్నకొద్ది గ్రేటర్‌ ఎన్నికల ప్రచార వేడి పీక్‌ స్టేజ్‌కు చేరుకుంటుంది..ప్రచార పర్వం వేడెక్కింది.. విమర్శలు, ప్రతివిమర్శలతో పార్టీలు హోరెత్తిస్తున్నాయి..ప్రతి రోజులు మిడ్ నైట్ వరకూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి..మరోవైపు గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌- ఎంఐఎం పార్టీల మధ్య స్నేహం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌ టీఆర్‌ఎస్‌,కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు..దీంతో ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.

టీఆర్ఎస్‌, ఎంఐఎం స్నేహం బీటలు వారుతోందా..తాము తలచుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చగలమన్న ఎంఐఎం ఎమ్మెల్యే మాటల వెనక ఆంతర్యమేంటి.. దీనికి టీఆర్ఎస్ నేతలు ఇస్తున్న కౌంటర్లు ఏ సందేశమిస్తున్నాయి..మరోవైపు టీఆర్ఎస్‌, ఎంఐఎం స్నేహంపై కాంగ్రెస్ ఎందుకు ఆరోపిస్తోంది..ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ జరగుతుంది..ఇది రాజకీయంగా రెండు పార్టీలు వేస్తున్న వ్యూహత్మక ఎత్తుగడలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్‌, ఎంఐఎం స్నేహంపై చేస్తున్న విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ముంతాజ్‌ఖాన్‌తో టీఆర్‌ఎస్‌,కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు.ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌ తాము తలచుకుంటే 2నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను ఇటీవలే కళ్లు తెరిచిన రామచిలుకతో పోల్చారు..రాజకీయం తమ ఇంటి గుమాస్తా అన్నారు..మరోవైపు పాతబస్తీలో మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేయాలన్నా అసదుద్దీన్ అనుమతి తీసుకోవాలన్నారు ఎంఐఎం మాజీ కార్పొరేటర్ ఖాజాబిలాల్ మరో అడుగు ముందుకేసి పాతబస్తీ సీఎం అసదుద్దీన్ అని బిలాల్ అన్నారు..ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఆరోపణల కంటే ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ జరుగుంది..రాజకీయంగా వ్యూహాంలో భాగంగానే చేయించనట్లు గ్రేటర్‌ ప్రజలు అంచన వేస్తున్నారు..ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్న ఎంఐంఎం ఎలా ప్రభుత్వాన్ని కూల్చుతుందని విమర్శిస్తున్నారు..ఇది టీఆర్‌ఎస్‌-ఎంఐఎం మధ్య స్నేహాం ఉందన్న బీజేపీకి కౌంటర్‌గానే చూడాలంటున్నారు విశ్లేషకులు.

ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఘాటుగానే స్పందించింది..ఎవరి బలమేంటో ప్రజలందరికీ తెలుసని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యానించారు.. మంత్రికేటీఆర్ బడానా , బచ్చానా అన్న సంగతిని ఆయన రోడ్‌షోలకు వస్తున్న జనాన్ని చూసి అర్థం చేసుకోవాలన్నారు.. పాతబస్తీ అభివృద్ధికోసం మంత్రి కేటీఆర్ చుట్టూ తిరిగిన సంగతి గుర్తించాలన్నారు..మరో వైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దింపుతామన్న ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలుపూర్తిగా టీఆర్‌ఎస్ -ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఓటర్లను దోఖా చేసే కుట్రని విజయశాంతి వ్యాఖ్యానించారు.. ఎంఐఎం ఏడుగురి ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి అవసరం లేదని చెప్పారు. అంటే ఎంఐఎం మతకలహాలు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెబుతున్నట్టా? అని ప్రశ్నించారు.జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక టీఆరెస్-ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకు తీరుతాయన్నారు. అవసరం లేకున్నా కలిసే ఉంటాయని చెప్పారు. ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్ అని విజయశాంతి తెలిపారు. .మరోవైపు టీఆర్ఎస్‌కు ఓటేస్తే , ఎంఐఎంకు ఓటేసినట్లే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రెండు పార్టీలు , ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు..

రెండు నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న ఎంఐఎం ఎన్నికల నోటీఫికేషన్‌కు ముందు రాష్ట్ర మంత్రి మండిలి సమావేశంలో పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశమే ఉంటే కేసీఆర్,ఎంఐఎం అధినేత రహస్య భేటీ ఎందుకు జరిగిందని..ముంతాజ్‌ చేసిన వ్యాఖ్యలు కేవలం రెండు పార్టీలు రాజకీయంగా ఆడుతున్న వ్యూహాత్మక ఎత్తుగడలే అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news