కేజీఎఫ్ హీరోలా ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చిన పుతిన్!

-

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ.. అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ మరో హెచ్చరిక జారీ చేశారు. కేజీఎఫ్ హీరో తరహాలో ప్రపంచానికే వార్నింగ్ ఇస్తున్నారు. ఉక్రెయిన్ ఆక్రమణను మరింత వేగవంతం చేసేందుకు అత్యంత శక్తివంతమైన క్షిపణిని రష్యా ప్రయోగించింది. జిర్కాన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, జిర్కాన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ధ్వని వేగం కన్నా 9 రెట్లు.. అంటే గంటకు 11 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నట్లు సమాచారం.

వాద్లిమర్ పుతిన్
వాద్లిమర్ పుతిన్

ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి అని నిపుణులు చెబుతున్నారు. బారెంట్స్ సముద్రంలోని అడ్మిరల్ గోర్షోవ్ ఫ్రిగేట్ యుద్ధనౌక నుంచి ఈ మిసైల్‌ను ప్రయోగించారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ను విజయవంతంగా చేధించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్షిపణిని శత్రు దేశాల రాడార్లు కూడా పసిగట్టలేవని, క్షిపణిలో వాడిన అప్‌గ్రేడెడ్ ఇంధనం వల్ల అది మెరుపులా దూసుకెళ్తుందన్నారు. జిర్కాన్ ముందు భాగంలో వాయు పీడనం క్షిపణి చుట్టు ప్లాస్మా మేఘాన్ని ఏర్పరుస్తుందని, రేడియో తరంగాలను శోషించుకుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news