అనిల్ రావిపూడి ప్లాన్ అదిరింది..NBK 108లో బాలయ్య సరసన ప్రియమణి?

-

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తర్వాత వరుస విజయాలుందుకున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఉన్నారు. కామెడీని ప్రధాన అంశంగా హైలైట్ చేస్తూ జనాలను ఎంటర్ టైన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇటీవల విడుదలైన F3 సినిమా కూడా ప్రజలను బాగా ఎంటర్ టైన్ చేస్తోంది. ఎఫ్ 2కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో హీరోలుగా వరుణ్ తేజ్, వెంకటేశ్ నటించగా, హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్ నటించారు.

ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి..మూవీ యూనిట్ సభ్యులు ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ కు మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ అందించారు. ఇందులో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. ఈ సంగతులు పక్కనబెడితే..అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ఫిల్మ్ టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్యతో చేయనున్నారు.

NBK 108లో యాక్షన్ అదిరిపోయేలా ఉంటుందని ఇప్పటికే అనిల్ రావిపూడి తెలిపారు. ఇప్పటి వరకు కామెడీనే ప్రధాన అంశంగా హైలైట్ చేసిన తాను.. ఈ చిత్రంలో వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నానని తెలిపారు.

ఇకపోతే ఈ చిత్రంలో కథానాయికగా ‘‘ఢీ’’ భామ ప్రియమణిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘మిత్రుడు’’ సినిమాలో బాలయ్య సరసన నటించిన ప్రియమణి..ఈ చిత్రంలోనూ మరో సారి జోడీ కట్టనుందని ఈ సందర్భంగా అభిమానులు అంటున్నారు. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇంకా రాలేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news