టోక్యో ఒలింపిక్స్ లో… చివరి వరకు పోరాడి… పివి సింధు కాంస్య పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయం అనంతరం… పీవీ సింధు ఇవాళ హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పీవీ సింధు కు ఘనస్వాగతం పలికింది. అనంతరం పీవీ సింధు ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన పీవీ సింధు… టోక్యో ఒలంపిక్స్ విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
ఈ విజయం కోసం తాను ఐదు సంవత్సరాలుగా కష్టపడుతున్నారని… తనతో పాటు కోచ్ బృందం కూడా ఎంతో సహాయం చేసిందని పేర్కొంది. కృషి, పట్టుదల ఉంటే ఇలాంటి విజయాలు అయినా సాధించగలమని స్పష్టం చేసింది పీవీ సింధు. ఒలంపిక్స్ కోసం తన కుటుంబానికి ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నానని ఎమోషనల్ అయింది పీవీ సింధు. కానీ ఒలింపిక్స్లో పతకం సాధించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని స్పష్టం చేసింది. ఒక్క పతకం తోనే ఆగిపోదని… భవిష్యత్తులో ఇంకా ఇలాంటి పతకం తీసుకొస్తానని పేర్కొంది పీవీ సింధు.