సాధారణంగా ఇండ్లలోకి పాములు చొరబడడం మామూలే. అయితే విదేశాల్లో మాత్రం జనాలకు కొండ చిలువల నుంచి అప్పుడప్పుడు ప్రమాదాలు ఎదురవుతుంటాయి. కొన్ని భారీ పొడవున్న కొండ చిలువలు ఇండ్లలోకి వస్తాయి. ఇక కొన్ని సాధారణ కొండ చిలువలు కూడా వస్తాయి. అయితే ఆ వ్యక్తి ఇంట్లోకి కూడా ఓ కొండ చిలువ చొరబడింది. కానీ అది చేసిన పనికి అతనికి ప్రాణాలు పోయినంత పనైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
సెంట్రల్ థాయిలాండ్‌లోని నోంతబురిలో 18 ఏళ్ల ఓ యువకుడు తన ఇంట్లో టాయిలెట్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే అందులో కొండ చిలువ ఉంది. దాన్ని అతను గమనించకుండా టాయిలెట్ సీట్‌పై కూర్చున్నాడు. ఈ క్రమంలో ఆ కొండ చిలువ అతని జననావయవానికి చుట్టుకుంది. అయితే కొంత సేపటికి అతనికి తీవ్రమైన నొప్పి, బాధ కలిగాయి. రక్తస్రావం కూడా జరిగింది. దీంతో అతను అదిరి పడి లేచి చూసే సరికి టాయిలెట్ లో కొండ చిలువ కనిపించింది.
కాగా అతను భయంతో కేకలు వేశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు అతనికి చికిత్స చేసి రక్షించారు. కొంచెం ఉంటే ప్రాణాపాయ స్థితి ఏర్పడేదని, అతన్ని సరైన టైముకు హాస్పిటల్‌కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో అతను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. కాగా ఆ కొండ చిలువను స్థానిక అటవీ శాఖ అధికారులు తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.