శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎం51 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో గురువారం విడుదల చేసింది. ఇందులో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్ కెమెరాల ద్వారా ఒకే టేక్‌లో 7 ఫొటోలు, 3 వీడియోలను తీసుకోవచ్చు. ఒక్కో వీడియో నిడివి 10 సెకన్లు ఉంటుంది. ఫోన్‌కు వెనుక వైపు 3డి గ్లాస్‌ను అమర్చారు. అందువల్ల ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క వైపుకు ఇచ్చారు. డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ కార్డుల కోసం డెడికేటెడ్ స్లాట్లను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇందులో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. అందువల్ల ఈ ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. అలాగే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావడం వల్ల చార్జింగ్ ఎక్కువ సేపు వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం51 స్పెసిఫికేషన్లు…
* 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లే
* 2400 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* 64, 12, 5, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
* 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్ సెలెస్టియల్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.24,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.26,999గా ఉంది. అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను ఈ నెల 18వ తేదీ నుంచి విక్రయిస్తారు. లాంచింగ్ ఆఫర్ కింద హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.2వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తారు.