బ్రేకింగ్: మొదటి త్రైమాసికంలో 23.9 శాతం కుప్ప కూలిన జీడీపీ…!

-

భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 23.9 శాతం తిరోగమనాన్ని నమోదు చేసిందని కేంద్రం పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 శాతం చొప్పున వృద్ధి చెందింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధి రేటు 4.2 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు అధికారిక అంచనాను, గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (మోస్పిఐ) సోమవారం ప్రకటించింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో కఠినమైన లాక్ డౌన్ అమలులో ఉండటం దీనికి ప్రధాన కారణం. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఫలితంగా జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోయిందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2020 మార్చి 24 న 21 రోజులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ జిడిపిలో దాదాపు 45 శాతం వాటా కలిగిన తయారీ, నిర్మాణం, వాణిజ్యం, హోటళ్ళు, రవాణా వంటి రంగాలు లాక్డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news