ఇక బయటకు వస్తే 14 రోజులు క్వారంటైన్…!

-

బయటకు రావొద్దు అని ఎన్ని విధాలుగా చెప్పినా ఎవరూ వినడం లేదు. పిల్లల హగ్గీస్ కోసం, చాక్లెట్స్ కోసం ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారు జనం. దీనితో ఇప్పుడు పోలీసులకు చికాకుగా మారింది ఈ వ్యవహారం. కరోనా కేసులను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించినా సరే జనం మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం తో కరోనా ఎక్కడ పెరుగుతుందో అనే ఆందోళన ప్రభుత్వాల్లో వ్యక్తమవుతుంది.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలీసులు దండం పెట్టి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో లాఠీ లతో చెప్పారు. అయినా సరే ఎవరూ కూడా మాట వినే పరిస్థితి కనపడటం లేదు. దీనితో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. పనీ పాట లేకుండా బయట తిరిగే వాళ్ళను ఇక కచ్చితంగా హోం క్వారంటైన్ కి 15 రోజులు తరలించాలని, అలాగే రెండేళ్ళ జైలు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వచ్చే వారిని ఇంకా ఉపేక్షించ వద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణా లో ఈ నిర్ణయం ముందు అమలు చేయనున్నారు. ఒక పక్క కేసులు పెరుగుతున్నా సరే ఎవరిలో కూడా మార్పు రావడం లేదు. దీనితోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మారకపోతే మాత్రం లక్ష రూపాయల జరిమానా విధించి, వాహనం సీజ్ చేసి, హత్యా నేరం కింద కేసు నమోదు చెయ్యాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version