కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విధించిన లాక్ డౌన్ ని ఎత్తివేయడానికి గానూ రంగం సిద్దం చేసింది. ఈ లాక్ డౌన్ ని దశల వారీగా ఎత్తి వేయడానికి గానూ సిద్దమైంది. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ని ఒక్కసారే ఎత్తివేయకుండా దీన్ని దశల వారీగా ఎత్తి వేస్తే ప్రజలు ఒక్కసారిగా బయటకు రాకుండా జాగ్రత్తలు పడతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి దీని విషయంలో ఏ విధంగా ముందుకి వెళ్తారు అనేది చూస్తే,
లాక్ డౌన్ ముందు బ్యాంకుల విషయంలో ఎత్తివేస్తారని అంటున్నారు. ప్రజలకు ఇప్పుడు డబ్బులు కావాలి కాబట్టి ముందు బ్యాంకులతో మాట్లాడి అప్పుడు ఎత్తివేస్తారని, ఇప్పుడు బ్యాంకులు పూర్తి స్థాయిలో పని చేసే పరిస్థితి లేదు. బ్యాంకింగ్ సేవలను పూర్తిగా అనుమతిస్తారు. దానితో పాటుగా రైల్వే విషయంలో కూడా దీన్ని సడలించే అవకాశం ఉంది. ఇప్పటికే రైల్వే శాఖ ఏప్రిల్ 15 నుంచి రిజర్వేషన్ లు ఓపెన్ చేస్తున్నామని ప్రకటించింది.
ఇక పబ్లిక్ రవాణా విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బస్సుల్లో ఇంత మందిని మాత్రమే అనుమతించే విధంగా ప్రభుత్వం సిద్దమైంది. ఇక ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార సంస్థలకు అనుమతులు ఇవ్వనున్నారు. ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి. సినిమా హాల్స్ విషయంలో లాక్ డౌన్ ని సడలించే అవకాశాలు కనపడటం లేదు. వినోద కార్యక్రమాల విషయంలో లాక్ డౌన్ ని పోడిగిస్తారు.