కామాంధుడి కర్కశం…! క్వారంటైన్ సెంటర్ లో మహిళల పై అత్యాచారయత్నం..!

-

quarantined woman molested by a toddler
quarantined woman molested by a toddler

కామానికి కళ్ళు లేవు.. కామాంధులకు హద్దు అదుపులు లేవు..! ఎంత నీచానికైనా దిగజారుతారు.. ఎంతటి హీనమైనా చర్య అయినా చేపడతారు. ఓ పక్క కరోనా మహమ్మారి అల్లకల్లోలం చేస్తుంటే.. మరోపక్క కామాంధులు విలయతాండవం చేస్తున్నారు. మొన్నటిదాకా కరోనా క్వారంటైన్ సెంటర్లను క్రికెట్ స్టేడియాలుగా పబ్బులుగా  చూసాము.. ఇప్పుడు కామాంధుల కలపాలు చేసే గృహాలుగా చూస్తున్నాము. ఓ కామాంధుడు విపరీత బుద్ధితో క్వారంటైన్ సెంటర్ లోకి ప్రవేశించి అక్కడి మహిళలపై లైంగిక దాడులు చేశాడు అంతటితో ఆగకుండా ఓ యువతి పై అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ క్వారంటైన్ కేంద్రంలోకి శంకర్ అనే స్థానిక యువకుడు మద్యం తాగి ప్రవేశించాడు. తాగిన మత్తులో బాత్‌రూమ్‌ వద్ద ఉన్న మహిళలపై లైంగిక దాడికి యత్నించగా అంతటితో ఆగకుండా అదే సమయంలో ఓ గదిలోకి దూరి నిద్రపోతున్న యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అక్కడే ఉన్న మహిళలు గట్టిగా కేకలు వేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకుని నిర్భందించారు. అనంతరం పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సుదురు వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేస్ ఫైల్ చేసి రిమైండ్ కు తరలించారు.. బాధిత మహిళ ముంబాయికి చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news