సన్ టాన్ అంటే.. మీరు ఎండలో తిరిగినప్పుడు సూర్యుడి కిరణాలు మీ చర్మం మీద పడి మీ చర్మం కమిలిపోతుంది. చర్మంపై షేడ్స్ వస్తాయి. ఎండలో తిరిగితే విటమిన్ డీ వస్తుందంటారు కానీ.. ఎర్రటి ఎండలో తిరిగితే చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి.
ఏం ఎండరా బాబు.. చంపేస్తోంది. ఈ ఎండలో ఇలాగే ఓ నాలుగు రోజులు తిరిగితే అంతే సంగతులు. ఎండలో బయటికి వెళ్లాలంటేనే భయమేస్తోంది.. అని అనుకుంటున్నారు కదా. అవును.. ఎండలో బయటికి వెళ్లడం చాలా డేంజర్. ఎండలో బయట ఎక్కువ సేపు తిరగడం వల్ల వడదెబ్బ మాత్రమే రాదు. మీరు సన్ టాన్ కు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. సన్ టానా? అంటే ఏంటి.. అంటారా?
సన్ టాన్ అంటే.. మీరు ఎండలో తిరిగినప్పుడు సూర్యుడి కిరణాలు మీ చర్మం మీద పడి మీ చర్మం కమిలిపోతుంది. చర్మంపై షేడ్స్ వస్తాయి. ఎండలో తిరిగితే విటమిన్ డీ వస్తుందంటారు కానీ.. ఎర్రటి ఎండలో తిరిగితే చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల చర్మంపై డైరెక్ట్ గా పడటం వల్ల చర్మం కందిపోవడం, ఎర్రగా మారడం, ముడతలు పడటం లాంటిది జరుగుతుంది. దీని వల్ల చర్మ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఒకవేళ మీరు ఎండలో తిరిగితే.. చర్మం కందిపోతే, ఎర్రగా మారితే.. ఈ ఇంటి చిట్కాలు పాటించి వాటిని పోగొట్టుకోండి.
నిమ్మచెక్కలు
నిమ్మకాయను తీసుకొని దాన్ని కట్ చేసి… నిమ్మ చెక్కలను మీ చర్మం కందిపోయిన దగ్గర రాయండి. తర్వాత కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత నీటితో కడుక్కోండి.
గంధం పొడి
– ఒక స్పూన్ గంధం పొడి తీసుకోండి.
– ఆ పొడిలో కొన్ని రోజ్ వాటర్, పాలు, కొన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు టాన్స్ దగ్గర రాయండి.
– తెల్లారి లేచాక దాన్ని శుభ్రంగా కడుక్కోండి.
టమాటా ప్యాక్
– యోగర్ట్ ఒక స్పూన్
– ఒక స్పూన్ నిమ్మరసం
– రెండు స్పూన్ల టమాటా గుజ్జు
-పై మూడింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపండి.
– తయారు చేసిన మిశ్రమాన్ని చర్మంపై ఎర్రబారిన ప్రాంతంలో రుద్దండి.
– 30 నిమిషాలు ఆగి.. చల్లని నీటితో కడుక్కోండి.
పొప్పడి పండు
– బాగా పండిన పొప్పడి పండును తీసుకొని పండును ముద్దలా చేయండి.
– ఆ ముద్దలో ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపండి.
– దాన్ని సూర్యుడి వల్ల కమిలిన ప్రాంతాల్లో రుద్దండి.
– 30 నిమిషాల తర్వాత నీటితో కడుక్కోండి.
బాదం పేస్ట్
– నీళ్లలో బాదాం పప్పును నానబెట్టండి.
– తర్వాత బాదాం మీద ఉన్న పొట్టును తీసేయండి.
– బాదాంను గ్రైండ్ చేసి కొన్ని పాలు కలిపి పేస్ట్ లా చేయండి.
– దాన్ని చర్మంపై కమిలిన ప్రాంతాల్లో రాసుకోండి.
– రాత్రి దాన్ని అలాగే ఉంచి తెల్లారి కడుక్కోండి.
కీరదోస రసం
కీరదోస నుంచి తీసిన రసాన్ని రోజ్ వాటర్, లెమన్ జ్యూస్ లో కలపండి. దాన్ని చర్మానికి రాసుకోండి. కొన్ని నిమిషాల పాటు ఆలాగే ఉంచాక నీళ్లతో కడుక్కోండి.
శనగపిండి పేస్ట్
– రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని దాన్ని పసుపు, పాలు, రోజ్ వాటర్ తో కలపండి.
– గిన్నెలో బాగా కలపండి.
– దాన్ని సన్ టాన్ ప్రభావిత చర్మంపై రుద్దండి.
– ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోండి.
ఓట్స్ పిండి
– 3 స్పూన్ల బటర్ మిల్క్ తీసుకోండి.
– దాన్ని 2 స్పూన్ల ఓట్ మీల్ తో కలపండి.
– కంటెయినర్ లో మిక్స్ చేయండి.
– దాన్ని చర్మంపై రుద్దండి. తర్వాత క్లీన్ చేసుకోండి.
ఆలు జ్యూస్
ఒక బంగాళదుంప తీసుకొని దాన్ని చిదిమేసి.. జ్యూస్ లా తయారు చేసుకోండి. దాంట్లో కొంచెం నిమ్మరసం కలిపి దాన్ని చర్మానికి రుద్దండి. 30 నిమిషాలు అలాగే వదిలేసి నీళ్లతో శుభ్రం చేసుకోండి.
నిమ్మరసం
-ఒక బకెట్ తీసుకోండి. దాంట్లో గోరు వెచ్చని నీటిని పోయండి.
-దాంట్లో కొంచెం నిర్మరసం కలపండి.
– టాన్స్ ఏర్పడిన చేతులు లేదా కాళ్లను అందులో ముంచండి.
– 10 నుంచి 15 నిమిషాలు అందులో ఉంచండి.
– తర్వాత చల్లని నీటితో కడగండి.
పసుపు, పాలు
కొన్ని పాలు తీసుకొని ఆ పాలల్లో కొంచెం పసుపు వేసి బాగా కలపి ఆ మిశ్రమాన్ని చర్మం కమిలిపోయిన ప్రాంతంలో రుద్దండి. అది పూర్తిగా ఎండిపోయేదాక అలాగే ఉంచండి. తర్వాత నీటితో కడుక్కోండి.
కొబ్బరి నీళ్లు
-కొబ్బరి నీళ్లను తీసుకొని దాంట్లో కొంచెం గంధం పొడి వేసి దాన్ని మిశ్రమంలా చేసి దాన్ని సన్ టాన్స్ ఉన్న ప్రాంతంలో రుద్దండి.
-కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోండి.
పైనాపిల్ గుజ్జు
పైనాపిల్ గుజ్జును తీసుకొని దాంట్లో కొంచెం తేనె కలపి దాన్ని టాన్స్ ఉన్న ప్రాంతంలో రుద్దండి.
కొంచెం సేపు అలాగే ఉంచి తర్వాత క్లీన్ చేసుకోండి.
యోగర్ట్
– ఒక బౌల్ లో యోగర్ట్ ను తీసుకొని దాంట్లో టమాట రసాన్ని వేసి బాగా కలపండి.
– ఎక్కడెక్కడ సన్ టాన్స్ ఉన్నాయో అక్కడ ఆ మిశ్రమాని రుద్దండి.
-ఓ అర్ధగంట తర్వాత దాన్ని నీళ్లతో కడగండి.
స్ట్రాబెర్రీ పేస్ట్
– 5 స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని మెత్తగా చేసి ఆ మిశ్రమంలో కొంచెం మిల్క్ క్రీమ్ వేసి బాగా కలపండి.
– ఆ మిశ్రమాన్ని సన్ టాన్స్ ఉన్న ప్రాంతంలో రుద్దండి.
– ఓ అర్ధగంట తర్వాత దాన్ని కడుక్కోండి.