ముంబై వేదికగా వరల్డ్ కప్ లో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు సౌత్ ఆఫ్రికా చుక్కలు చూపిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకు వెళుతోంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా కీపర్ మరియు ఓపెనర్ బ్యాట్స్మన్ క్విన్టన్ డికాక్ బంగ్లా బౌలర్లకు పీడకలగా మార్చాడని చెప్పాలి. ఇతను 140 బంతులను ఆడి 15 ఫోర్లు మరియు 7 సిక్సులతో 174 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో ఆడిన అయిదు మ్యాచ్ లలో మూడు సెంచరీ లు చేశాడు డికాక్. బాంగ్లాదేశ్ బౌలర్లను ఎవరినీ వదలకుండా భయంకరమైన షాట్ లతో విరుచుకుపడ్డాడు. ఇతను ఆడుతున్న తీరు మరియు కాంఫిడెన్స్ చూస్తే ఖచ్చితంగా డబుల్ సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు.. కానీ దురదృష్టవశాత్తూ హాసన్ మహమ్మద్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
డికాక్ ఏ విధంగా బ్యాటింగ్ చేయగలడో మరోసారి ఈ ప్రపంచానికి నిరూపించాడు.. ఇంకా నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నందున డబుల్ సెంచరీ చేస్తాడేమో చూడాలి.