కలబంద, ఉసిరి కలిపి తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు..!

-

బరువు తగ్గాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సలాడ్స్‌, ఫైబర్‌ ఫుడ్‌, జ్యూస్‌లు తీసుకుంటారు. బయట దొరికే వెయిట్‌ లాస్‌ డ్రింక్స్‌ కంటేఆయుర్వేద చిట్కాలతో ఇంట్లో చేసిన పానియాలు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. చాలా మంది ఇళ్లలో కలబంద మొక్కలు ఉంటాయి. వాటిని ఎంతసేపూ తలకూ, ముఖానికి మాత్రమే పెట్టుకుంటారు. కానీ కొంతమంది కలబందను అలా కూడా వాడరు. కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్‌ ఉంటాయి. దీనిలో కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబంద జ్యూస్‌ తాగితే బరువు త్వరగా తగ్గొచ్చని మీకు తెలుసా..? అసలు కలబంద జ్యూస్‌ ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా మేలు చేస్తుందో తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్‌ మొత్తం చదివేయండి.

aloe vera

బరువు తగ్గడానికి మార్కెట్‌లో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కానీ కొన్ని డ్రింక్స్ తాగితే ఊబకాయం కరిగిపోతుంది. ఉసిరి, కలబంద రసం తాగడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులను నయం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే కాలేయం, గుండె ఆరోగ్యంగా ఉంటాయి.

ఈ రసం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దీని కోసం, ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల కలబంద, ఉసిరి రసం కలపి తాగండి. ఈ పానియాన్ని డైలీ పరగడుపున తాగండి. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.

కలబంద జ్యూస్‌ తాగడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా ఇది జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. బాడీలో హీట్‌ ఎక్కువగా ఉండే వాళ్లు కూడా ఈ జ్యూస్‌ తాగితే.. మంచి ఫలితం ఉంటుంది. కలబందలో లెక్టిన్లు, ఆంత్రాక్వినోన్స్ ఉంటాయి. వీటిలో సహజంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. షుగర్‌ పేషెంట్స్‌ కలబంద జ్యూస్‌ తాగేముంపు డాక్టర్‌ను సంప్రదించడం మేలు.

Read more RELATED
Recommended to you

Latest news