మోదీ గారు వ్యవసాయ చట్టాలను కూడా వెనక్కి తీసుకోండి- ఆర్. నారాయణ మూర్తి

-

సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనిపై పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి కూడా సాగు చట్టాల రద్దుపై స్పందించారు. గతేడాది కాలంగా రైతులు సాగు చట్టాలకు వ్యతిరేఖంగా ఉద్యమిస్తున్నారని, వారి త్యాగాలకు, దేశవ్యాప్తంగా వారి పోరాటానికి వచ్చిన మద్దతు చూసి సాగు చట్టాలు రద్దు చేయడం ప్రధాని మోదీ తీసుకున్న సరైన నిర్ణయమని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకుని వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన మోదీని లార్డ్ మింటోతో పోల్చారు. ఇదే విధంగా కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ చట్టాలను కూడా రద్దు చేయాలని మోదీని కోరారు నారాయణ మూర్తి. సాగు చట్టాల కోసం పోరాడి కేసుల పాలైన వారి మీద కేసులు ఎత్తేయాలని, మరణించిన వారికి పరిహారం అందించాలని నారాయణ మూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

విద్యుత్ రంగాన్ని ప్రైవేటు రంగంగా మారిస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారని .. ఇప్పుడు ఆ చట్టాలు తీసుకువస్తే రైతుల ఇబ్బందులు ఎదరుకుంటారని నారాయణ మూర్తి అన్నారు. మద్దతు ధర అంశంపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వాలని నారాయణ మూర్తి కోరారు.

 

.

Read more RELATED
Recommended to you

Exit mobile version