ప్రభాస్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ : రాధేశ్యామ్‌ నుంచి అదిరిపోయే అప్డేట్‌

-

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌… హీరోగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్‌. ఈ సినిమా ను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్‌ చేస్తుండగా.. యూవీ క్రియేషన్స్‌ సమర్పణం లో రాధేశ్యామ్‌ తెరకెక్కుతోంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ స‌ర‌స‌న టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 23 వ తేదీన ప్రభాస్‌ పుట్టిన రోజు ఉంది. ఈ నేపథ్యంలోనే 23 వ తేదీన ఉదయం 11.16 గంటలకు రాధేశ్యామ్‌ టీజర్‌ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు ప్రభాస్‌ పోస్టర్‌ ను విడుదల చేసింది రాధేశ్యామ్‌ చిత్ర బృందం.   కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అంటే జనవరి 14 తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news