12 దేశాల్లో రాధేశ్యామ్ వీఎఫ్ఎక్స్ ప‌నులు

-

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ రాధేశ్యామ్ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. అయితే ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో రానుంద‌ని తెలుస్తుంది. దాని కోసం ఈ సినిమా గ్రాఫిక్స్ ప‌నులు 12 దేశాల్లో జ‌రుగుతున్నాయ‌ని డైరెక్ట‌ర్ రాధాకృష్ణ ఒక ఇంట‌ర్వూలో తెలిపారు. కాగ రాధాశ్యామ్ ట్రైల‌ర్ విడుద‌ల అయిన నాటి నుంచే ఈ సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్ ఉంటాయ‌ని తెలుస్తుంది.

ఈ ట్రైల‌ర్ లో ఉన్న రిచ్ గ్రాఫిక్స్ తో సినిమా ఇంకా అంచ‌నాలు విప‌రీతంగా పెరుగుత‌న్నాయి. కాగ రాధేశ్యామ్ సినిమాకు వీఎఫ్ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్ క‌మ‌ల్ క‌న్న‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే క‌మ‌ల్ క‌న్న‌న్ రాధేశ్యామ్ సినిమా కు మంచి గ్రాఫిక్స్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని డైరెక్ట‌ర్ తెలిపారు. కాగ రాధేశ్యామ్ సినిమా 1970 నాటి కాలంలో ఒక ఆస‌క్తి కర‌మైన ప్రేమ క‌థ తో తెర‌కెక్కుంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 14 న పాన్ ఇండియా లెవ‌ల్ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news