సౌతాఫ్రికాపై దుమ్ము లేపుత‌న్న కెఎల్ రాహుల్.. సెంచ‌రీ పూర్తి

-

ఇండియా సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెన‌ర్ కెఎల్ రాహుల్ దుమ్ము లేపుతున్నాడు. ఈ మ్యాచ్ లో కె ఎల్ రాహుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. అతి క‌ష్ట‌మైన స‌ఫారీ పిచ్ ల‌పై బౌల‌ర్లును దీటుగా ఎదుర్కొంటు కెఎల్ రాహుల్ సులువుగా సెంచ‌రీని పూర్తి చేశాడు. ఈ సెంచ‌రీతో కెఎల్ రాహుల్ రికార్డుల‌ను సైతం సృష్టిస్తున్నాడు. సౌతాఫ్రికా పిచ్ ల‌లో సెంచ‌రీ చేసిన రెండో భార‌త బ్యాట్స్ మెన్ గా కెఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. కాగ 2007 లో భార‌త బ్యాట‌ర్ వ‌సీం జాఫ‌ర్ కేప్ టౌన్ లో సౌతాఫ్రికా పై సెంచ‌రీ న‌మోదు చేశాడు.

కాగ నేడు కెఎల్ రాహుల్ సెంచూరియ‌న్ మైదానంలో సెంచ‌రీ బాదాడు. కాగ కెఎల్ రాహుల్ 218 బంతుల వ‌ద్ద వంద ప‌రుగుల మార్క్ ను అందుకున్నాడు. కాగ రాహుల్ 13 ఫోర్ల‌ను, ఒక్క సిక్స్ ను కూడా బాదాడు. కాగ ప్ర‌స్తుతం టీమిండియా మూడు వికెట్ల‌ను కొల్పోయి 240 ప‌రుగులు సాధించింది. మ‌రో ఓపెన‌ర్ మాయంక్ అగార్వాల్ 60 పరుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు. అలాగే చ‌తేశ్వ‌ర పుజారా గొల్డెన్ డౌక్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ కోహ్లి 35 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్ర‌స్తుతం క్రిజ్ లో కెఎల్ రాహుల్ తో పాటు అజిక్య ర‌హానే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news