శ్రీలంక బాంబ్ పేలుళ్ల నుండి తప్పించుకున్న హీరోయిన్ రాధికా

-

శ్రీలంకలో ఈరోజు ఉదయం వరుస ఉగ్రవాదుల బాంబు పేళ్లుళ్లు అందరికి షాక్ ఇచ్చాయి. ఈస్టర్ కావడంతో చర్చ్ లలో ఉగ్రదాడులు జరిగాయి. ఈ బాంబు పేలుళ్ల నుండి కొద్దిలో తప్పించుకున్నారు నటి రాధికా శరత్ కుమార్. ఈస్టర్ కావడంతో రాధికా ఉంటున్న హోటల్ లో బాంబ్ పేల్చారు. ఉగ్రవాదులు చేసిన ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల 50మందికి పైగా చనిపోగా 200 మందికి గాయాలయ్యాయని తెలుస్తుంది.

రాధికా శరత్ కుమార్ సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో బస చేశారు. అయితే పేలులు జరిగే కొద్దిసేపటి ఉందే ఆమె ఆ హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయింది. రాధికా వెళ్లిన కొద్దిసేపట్లోనే కొలంబోలో ఆరు చోట్ల బాంబ్ బ్లాస్ట్ జరిగాయి. రాధికా దిగిన హోటల్ కూడా ఆ ప్రమాదం లో ఉంది. భారీ ప్రమాదం నుండి తప్పించుకున్నా అంటూ రాధికా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version