హెయిర్ కటింగ్ కోసం వెళ్తే చంపేశారు..!

-

హైదరాబాద్ లోని సైదాబాద్ లో దారుణం చోటు చేసుకున్నది. హెయిర్ కటింగ్ కోసం వెళ్తే ఓ యువకుడి ప్రాణాలే పోయాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కటింగ్ షాపు యజమానితో ఆ యువకుడికి వాగ్వాదం చోటు చేసుకున్నది. డబ్బు ఇచ్చే విషయంలో ఆ యువకుడు, యజమానికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఆ షాపు యజమానికి చెందిన ఐదుగురు బాడీ బిల్డర్లు యువకుడిని గట్టిగా పట్టుకోవడంతో ఆ యువకుడికి ఊపిరి ఆడలేదు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు కార్తీక్ గా గుర్తించారు. ఈ ఘటన కరమ్ బాగ్ లోని హెయిర్ సెలూన్ లో చోటు చేసుకున్నది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షాపు యజమానితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అసలు వీళ్ల మధ్య గొడవకు కారణమేంటో కనుక్కునే పనిలో పడ్డారు. అయితే.. హెయిర్ కటింగ్ డబ్బు విషయంలో గొడవ జరగడం.. ఒకరి ప్రాణాలు పోవడం స్థానికంగా కలకలం లేపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version