గత రెండు, మూడు రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశం బాగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వైసీపీలో గెలిచి…అదే పార్టీలో ఉంటూ ఇంతకాలం వైసీపీపైనే విమర్శలు చేస్తూ వస్తున్న రఘురామ..మరో మూడు రోజుల్లో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు వైసీపీలోనే ఉంటూ..ఆ పార్టీపైనే విమర్శలు చేశారు. అలాగే ఢిల్లీలో ఉంటూ ప్రతిరోజూ రచ్చబండ పేరిట జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఇంతకాలం ఢిల్లీలో కాలం గడిపిన రఘురామ…ఇక నుంచి ఏపీకి వచ్చి రాజకీయాలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మామూలుగా వస్తే బీజేపీ చుక్కలు చూపిస్తుంది. అందుకే ఆయన బీజేపీలో చేరనున్నారని ప్రచారం మొదలైంది. అలాగే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది. ఈ రాజీనామా తర్వాత ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రాజీనామా తర్వాత నరసాపురం ఉపఎన్నిక వస్తుంది. ఆ ఎన్నికలో రఘురామ పోటీ చేస్తారు. అయితే బీజేపీ నుంచి ఆయన గెలవలేరు…జనసేన మద్ధతు ఉన్నా సరే గెలుపు ఈజీ కాదు..ఈ క్రమంలో ఆయన టీడీపీ మద్ధతు కూడా తీసుకొనున్నారు. అంటే టీడీపీ-బీజేపీ-జనసేనల కాంబినేషన్‌లో రాజుగారు పోటీకి సిద్ధమవుతారని తెలుస్తోంది. ఇక ఇక్కడ నుంచి ఆ మూడు పార్టీల పొత్తు కూడా మొదలవుతుందని ప్రచారం వస్తుంది. మరి చూడాలి రాజుగారు ఎలాంటి ట్విస్ట్‌లు ఇస్తారో?