ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు గోరు మీద ఉన్న వెంట్రుక తో కూడా రేవంత్ రెడ్డి సమానం కాదని బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కామెంట్స్ చేశారు. రఘునందన్ రావు చేసిన కామెంట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రఘునందన్ రావు మాట్లాడుతూ మోడీ కాలి గోరు మీద ఉన్న వెంట్రుకతో కూడా రేవంత్ రెడ్డి సమానం కాదు అని అన్నారు.
ఆయనలా నేను మాట్లాడగలను ఆయనకంటే నేను రెండు ఆకులు ఎక్కువే చదివాను అని అన్నారు రఘునందన్ రావు. రఘునందన్ రావు మొన్నామధ్య రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడి విషయం మనకి తెలిసిందే. కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి కమ్యూనిస్టులని విమర్శించిన రేవంత్ రెడ్డి తెలంగాణకి వచ్చి కమ్యూనిస్టులని పొగుడుతున్నారని అన్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు అని కూడా విమర్శించారు ఇప్పుడు తాజాగా ఇలా మోడీ కాళ్లు గోరు వెంట్రుక కూడా సమానం కాదు రేవంత్ రెడ్డి అని కామెంట్స్ చేశారు.