పథకాలు అమల పేరుతో ప్రజల్ని రేవంత్ రెడ్డి మభ్యపెడుతున్నారని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలు నాలుగు నెలలు అవుతున్నా అమలు చేయట్లేదని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. రోడ్ షో లో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందంతో బిజెపి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నట్లు ఆరోపించారు.
ఆగస్టు 15వ తేదీ లోగా రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ఆరోగ్యానికి లో అమలు చేస్తామని ప్రజలకి అరిచేతుల్లో వైకుంఠాన్ని చూపించారని ప్రజలు నిలిపిస్తుంటే బిక్క మొహం వేస్తున్నట్లు విమర్శించారు.