నీకు ఆ సోకు ఉంటే.. ఉద్యోగానికి రాజీనామా చెయ్ : సిద్దిపేట కలెక్టర్ కు రఘునందన్ కౌంటర్

మీకు రాజకీయం చేయాలని సోకు ఉంటే.. ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి రావాలని.. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి వ్యాఖ్యలకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రజా ప్రతి నిధులు, న్యాయ వ్యవస్థ ను కించ పరిచేలా కలెక్టర్ మాట్లాడారని ఫైర్ అయ్యారు. చేసిన తప్పును కనీసం సవరించుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.

న్యాయ వ్యవస్థ ను కించ పరిచేలా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి మాట్లాడారు.. కనీసం న్యాయమూర్తులైన స్పందించి సుమోటో గా కేసు నమోదు చేస్తారనుకున్నామని తెలిపారు. వరి వేయవద్దు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, సీఎస్ నుంచి కానీ ఏమైనా ఆదేశాలు వచ్చాయా.. వస్తే చూపించాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి, కేంద్ర హోంమంత్రి కి కలెక్టర్ పై ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. ఈ ఆరేళ్లు గా జిల్లా లో జరిగిన అక్రమాల పై ఒక్కొక్కటిగా వెలుగులో తెస్తామని హెచ్చరించారు రఘునందన్ రావు. కలెక్టర్ తన మాటలు వెనక్కి తీసుకొని 24 గంట ల్లో రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు రఘునందన్ రావు.