జర జాగ్రత్త జగన్.. నీ చుట్టూ కట్టప్పలు ఉన్నారు: రఘురామకృష్ణంరాజు

-

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి సొంత పార్టీ నాయకుడే కనీసం నిద్ర కూడా పోకుండా విమర్శ అస్త్రాలతో ముంచెత్తుతున్నాడు. అతనే ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై పై సొంత పార్టీ నాయకుల గురించి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ గురుంచి విమర్శలు చేస్తున్నారు. ఈరోజు తన సొంత నియోజకవర్గమైన రాజమండ్రి లో ఇసుక మాఫియా ఎక్కువైందని, ఈ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఇసుక పాలసీ లో అనేక తప్పులున్నాయని అవి ముఖ్యమంత్రి గుర్తించలేకపోతున్నారు అని అన్నారు.

raghu
raghu

ముఖ్యమంత్రి జగన్ పక్కన అనేకమంది కట్టప్పలు ఉన్నారని వారిని జగన్ చూడలేక పోతున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. ఈ కట్టప్పలు సమాజంలో జరుగుతున్న అవినీతి పనులను మంచిగా మార్చి జగన్ చెవిలో చెబుతున్నారని ఆరోపించారు. మా జిల్లాను పర్యవేక్షించే కట్టప్ప అనేక విషయాలను వక్రీకరించి చెబుతున్నారని అది గుర్తించలేక ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news