ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీనితో అన్ని పార్టీల వారూ కూడా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ వారంతా కాంగ్రెస్ హామీలను అమలు చెయ్యట్లేదు అని అంటున్నారు. మరో పక్క కాంగ్రెస్ ఇచ్చిన హామీలని పక్కా అమలు చేస్తామని చెప్తోంది. అలానే రేవంత్ రెడ్డి కూడా హామీలను అమలు చేస్తాం అని చెప్తోంది.
ఒకవేళ కేంద్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కాంగ్రెస్ ప్రకటించిన 45 పేజీల్లో ఉన్న 25 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం అని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. కేంద్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఇలా చేసి తీరుతాం అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.