మే 13న వేతనంతో కూడిన సెలవు.. ఈసీఓ వికాస్ రాజ్

-

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ నామినేషన్ల పర్వం ముగిసింది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు ఈనెల 29 వరకు తుది గడువు విధించారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు, 1 అసెంబ్లీ స్థానానికి, ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈసీఓ వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మే 13న వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ.. ఈసీఓ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ఇతర రాష్ట్రాలకు అంటే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఛతీస్ గడ్  కి చెందిన ఉద్యోగులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ల రాష్ట్రాలకు వెళ్లినట్టయితే.. వారికి వేతనం ఇవ్వాల్సిందిగా ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news