తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత పదేళ్ల పాలనపై ఆంధ్రప్రదేశ్ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలోని భూముల విలువ భారీగా పెరిగిందన్నారు. కేసీఆర్ కంటే ముందు భూముల విలువ మరి అంతగా లేదని పేర్కొన్నారు. ఆయనకు కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా అభిమానం అని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో భాగంగా మాట్లాడారు. తెలంగాణ విలువనును పది రేట్లు పెంచారని కొనియాడారు.
హైదరాబాద్ ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల విలువ ఏకంగా 50శాతం కంటే ఎక్కువగా పెరిగిందని, ఇదంతా కేసీఆర్ వల్లే జరిగిందన్నారు.గతంలో కరీంనగర్లో రూ.10 లక్షలకు ఎకరం వచ్చేదని ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి 70 లక్షలు పలుకుతుందంటే.. దాని ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఉండి సెగ్మెంట్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.