ఈ దేశాన్ని అర్థం చేసుకోవడానికే భారత్ జోడో యాత్ర : రాహుల్ గాంధీ

-

విద్వేష రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించాలన్న నినాదంతో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం మూడో రోజుకు చేరింది. తమిళనాడు కన్యాకుమారిలోని నాగర్​కోయిల్​లో రాహుల్ పాదయాత్ర చేశారు. “ఈ యాత్ర ద్వారా నేనేంటో, ఈ దేశమేంటో నాకు కొంత అర్థమవుతుంది. రానున్న 2-3 నెలల్లో నేను మరింత తెలివిగా మారతాను” అని రాహుల్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు తాను అధ్యక్షున్ని అవుతానా లేదా అన్నది తేలుతుందని రాహుల్ గాంధీ అన్నారు. అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న రాహుల్‌గాంధీ.. ఆ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టంచేశారు. భారత్‌ జోడో యాత్రకు తాను నాయకత్వం వహించడం లేదని తేల్చి చెప్పారు.

” దేశం కోసం పని చేయడం ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజా సమస్యలను తెలుసుకుని వారితో మమేకమవ్వడమే భారత్ జోడో యాత్ర ప్రధాన ఉద్దేశం. దేశంలోని దర్యాప్తు సంస్థలను భాజపా తన గుప్పిట్లోకి తీసుకుంది.”
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Read more RELATED
Recommended to you

Latest news