మోడీ పుట్టుక తో ఓబీసీ కాదు: రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోడీపై విమర్శలు గుప్పించారు ప్రధాన నరేంద్ర మోడీ పుట్టుకతో ఓబీసీ కాదని తాను ఓబీసీగా పేర్కొంటూ ప్రజల్ని తప్పు తోవ పట్టిస్తున్నారని అన్నారు ఒడిశాలో భారత్ జూడో న్యాయ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు గుజరాత్ లోని తెలియ కులానికి చెందిన కుటుంబంలో మోడీ పుట్టారని తాను గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు 2000 సంవత్సరాల్లో తన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని చెప్పారు.

కాబట్టి మోడీ పుట్టుకతో ఓబిసి కాదని అన్నారు బిజెపి కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. ప్రధాని ఓబీసీ లతో కరచాలనం చేయరని కానీ బిలినియర్లని మాత్రం పదే పదే కౌగిలించుకుంటారని అన్నారు. రాష్ట్ర ప్రజల్ని దోచుకోవడానికి బీజేపీతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జతకట్టిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news