జోడో యాత్రలో మహిళలతో కలిసి రాహుల్ డ్యాన్స్

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో 9వ రోజు కొనసాగుతోంది. రాహుల్​ వెంట కార్యకర్తలు, అభిమానులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు మమేకం అవుతుండగా వారి సమస్యలు తెలుసుకుంటూ.. రాహుల్‌ ముందుకు సాగుతున్నారు.

సంగారెడ్డి జిల్లాలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో జిల్లా ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు. పలువురు వెన్నెముక వికలాంగులు రాహుల్‌ గాంధీని కలిసి సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం సమర్పించారు. గణేశ్​ గడ్డ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర.. సంగారెడ్డి శివారు వరకు చేశారు. ఈ యాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో రాహుల్​కు ఘనస్వాగతం లభించింది. కొన్నిచోట్ల మహిళలు బోనాలతో రాహుల్​కు స్వాగతం పలికారు. రాహుల్ మహిళలతో కలిసి ఉత్సాహంగా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా వారితో కలిసి డ్యాన్స్ చేశారు. అనంతరం పోతురాజు విన్యాసాలు తిలకరించారు. కొరడాతో రాహుల్​ తనని తాను కొట్టుకున్నారు.

 

అనంతరం ప్రారంభమైన పాదయాత్ర సంగారెడ్డి శివారుకు చేరుకున్న తర్వాత భోజన విరామం తీసుకున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీకి అడుగడుగునా ఘనస్వాగతం పలికేలా నాయకులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు రోజులపాటు రాహుల్ యాత్ర సాగనుంది. దేశంలో విద్వేషాన్ని పారద్రోలి ప్రేమాభిమానాలు పెంపొందించే లక్ష్యంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news