నిప్పులు చెరిగిన రాహుల్.. దీపాలు వెలిగించడం కాదు..?

-

గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్న రాహుల్ గాంధీ మరోసారి తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించిన సమాచారం తమ దగ్గర లేదు అంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై స్పందించిన రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి విరుచుకుపడ్డారు.

rahul

కరోనా వైరస్ పోరులో ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల సమాచారం తమ వద్ద లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ విమర్శించారు రాహుల్ గాంధీ. ఈ మేరకు రాజ్యసభ లో ఇచ్చిన సమాధానం సరైనది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వం సమాధానం కరోనా యోధులను అవమానించే విధంగా ఉంది అంటూ ఫైర్ అయ్యారు. దీపాలను వెలిగించి కంచాల ను కొట్టి శబ్దాలు చేయడం కంటే కరోనా యోధుల రక్షణ ఎంతో ముఖ్యమైనది అంటూ హితవు పలికారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news