రాహుల్ గాంధీ పాకిస్తాన్ ఎజెండాను మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు : అమిత్ షా

-

ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా బుధవారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు .పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను గతంలో ‘గొప్ప’ నాయకుడిగా అఖిలేష్ యాదవ్‌ పేర్కొన్నారని ఆయనపై విమర్శలు చేశారు. యూపీలోని హర్దోయ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ… ఎండలు పెరిగినప్పుడు ప్రతి వేసవి రాహుల్ బాబా థాయ్‌లాండ్ వెళ్తారు, కానీ ప్రధాని మోడీ 23 ఏళ్లుగా విరామం తీసుకోలేదని అన్నారు.రాహుల్ గాంధీ పాకిస్తాన్ ఎజెండాను మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు అని అమిత్ షా విమర్శించారు.

ఇండియా కూటమి మొత్తం అవినీతి విలువ రూ. 12లక్షల కోట్లని, 23 సంవత్సరాలుగా ఏ చిన్న అవినీతి కూడా ప్రధాని మోడీ చేయలేదని అన్నారు. జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి తన ఇంట్లో రూ. 30 కోట్లు, ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో రూ. 350 కోట్లు, మమతా బెనర్జీ ప్రభుత్వంలో మాజీ మంత్రి వద్ద రూ. 50 కోట్లు పట్టుబడ్డాయని అమిత్ షా వెల్లడించారు. లోక్‌సభ మొదటి మూడు దశల్లోనే ఎన్డీయే కూటమి 190 సీట్లను అధిగమించిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news