పోరగాల్లమే అయిన చిచ్చరపిడుగుల వలె కొట్లాడినం : ఈటెల రాజేందర్

-

దివ్యాంగులకు అద్భుతమైన సృజనాత్మకత, మేధస్సు, జ్ఞాపకశక్తి ఉంటుంది అని ఈటెల రాజేందర్ అన్నారు.ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అవ్వగానే దివ్యాంగులకు 6000 పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు ఏ ఒక్కరికైనా వచ్చిందా ? అని ప్రశ్నించారు.కొత్తగా ఒకరికి కూడా పెన్షన్ ఇవ్వడం లేదు.ఆరు గ్యారెంటీలు 66 రకాల హామీలు 420 పనులు చేస్తా అన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అక్కడి నుంచి లంకె బిందెలు తీసుకొస్తా అంటున్నారు ఎలా నమ్మేది ? అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.

ఈ రాష్ట్రంలో నాకు పరిచయం లేని సంఘము లేదు. ఎవరు ఎక్కడ టెంట్ వేసిన నేను వెళ్లి మద్దతు తెలిపాను. వికలాంగులు, మరుగుజ్జులు, వీఆర్ఏలు, వీఆర్వోలు, మహిళాసంఘాలు, ఆశవర్కర్లు, ఆర్టీసీకార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామపంచాయతీ సిబ్బంది బాధ ఉన్నదని గాయిపెడితే నేను ఉన్న అని చెప్పి సంఘీభావం చెప్పిన బిడ్డను అని తెలిపారు. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో పెరిగిన బిడ్డను.మీ బాధలన్నీ తెలిసిన వాడిని. పోరగాల్లమే అయిన చిచ్చరపిడుగుల వలె కొట్లడినం.అప్పటినుంచి అది అదే పోరాటం.. అధికారంలో ఉన్నా కూడా కొనసాగింది అని అన్నారు.మంత్రి అయ్యాక..గుర్తింపులేని కులాలకు సర్టిఫికెట్ ఇప్పించాను.78 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టించడానికి శ్రీకారం చుట్టింది నేనే. కరోనాపేషంట్ల దగ్గరకు వెళ్లి పలకరించి ధైర్యం ఇచ్చి కాపాడిన బిడ్డను. అవసరం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు అండగా ఉన్నాను.ప్రధాని రెండు లక్షల ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చిన కేసీఆర్ వాటిని కట్టలేదు అని మండిపడ్డారు. పేదలకు సొంత ఇళ్లు కల నెరవేర్చే బాధ్యత బిజెపిది అని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news