ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై జగన్ మరోసారి స్పందించారు.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ… ‘రాజకీయ స్వార్థంతో వారు ఇలా చేయడం దారుణం అని అసహనం వ్యక్తం చేశారు. వందేళ్ల తర్వాత సర్వే చేసి.. భూ రికార్డులు సిద్ధం చేశాం. భూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టం అని తెలిపారు. 17వేల గ్రామాల్లో రికార్డులు పూర్తయ్యాయి. టైటిల్స్ లో తప్పులు లేకుండా చూడటమే గ్యారంటీ. భూములకు ఇన్సూరెన్స్ ఉంది. సచివాలయాలనే రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా మార్చాం’ అని తెలిపారు.
మేనిఫెస్టోపై విశ్వసనీయత తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలోనే వచ్చిందని అన్నారు.59 నెలల మా పాలనలో ప్రతి ఏటా మేనిఫెస్టోను ప్రజల వద్దకు పంపాం అని తెలిపారు. వాళ్లకు పథకాలు అందించాం. చెప్పినవన్నీ జరిగాయా? లేదా? అని వారినే అడిగాం. 99% హామీలు అమలు చేసి.. ప్రజల ఆశీస్సులకై వెళ్తున్నాం. మేనిఫెస్టోకు విశ్వసనీయత కల్పించామని తలెత్తుకుని చెప్పగలను’ అని అన్నారు.