కాంగ్రెస్ కంచుకోటగా పేరు వున్నా అమేఠి లోక్సభ నియోజకవర్గం ఇంకోసారి చర్చల్లో నిలిచింది. 2019 దాకా వరుస ఎన్నికల్లో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఈ నియోజకవర్గంలో నుండి ఇంకోసారి కాంగ్రెస్ దగ్గర నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తారని వార్తలు వినపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల హీట్ మొదలైనప్పటినుండి కూడా చర్చ సాగుతోంది రాహుల్ గాంధీ ఇప్పటికీ కేరళలోని వయనాడు నియోజకవర్గం నుండి పోటీకి నామినేషన్ కూడా దాఖలు చేశారు.
తాజాగా అమేఠి నియోజక వర్గానికి సంబంధించి రాహుల్ గాంధీ స్పందించారు అఖిలేష్ యాదవ్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ని అమేఠి నుండి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా అని అడగగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు ఈ విషయంలో కూడా సీఈసీ లో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అమేఠి నుండి రాహుల్ గాంధీ పోటీ చేయకపోవడం ప్రజల్లో తప్పుడు సందేశాన్ని పంపుతుందని యూపీ బీహార్ ఎంపీ లో గెలవకపోతే వైనాడ్ నుండి గెలిచినా ప్రయోజనం ఉండదని అన్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.