కరోనా వైరస్ విషయంలో ఇండియా కంటే కూడా దాయాది పాకిస్తాన్, దాని సరిహద్దు దేశం ఆఫ్ఘనిస్తాన్ బాగా పని చేశాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి అన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ ఈ ఏడాది మరింత పతనం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది 10.3 శాతం పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఐఎంఎఫ్ వృద్ధి అంచనాలను వర్ణించే చార్ట్ ను ఆయన పోస్ట్ చేసారు.
చైనా, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ , మయన్మార్, నేపాల్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లో ఆర్ధిక వ్యవస్థ మెరుగు పడుతుంది అని చెప్పారు. ట్వీట్ లో రాహుల్ గాంధీ ఏమన్నారు అంటే… “బిజెపి ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కూడా కోవిడ్‌ను భారతదేశం కంటే మెరుగ్గా నిర్వహించాయి.” అని వివరించారు.
Another solid achievement by the BJP government.
Even Pakistan and Afghanistan handled Covid better than India. pic.twitter.com/C2kILrvWUG
— Rahul Gandhi (@RahulGandhi) October 16, 2020