కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకన్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం తెలిపారు. శాలువాలతో సన్మానించారు. ఆ తర్వాత స్పెషల్ హెలికాప్టర్ వరకు నడుచుకుంటూ వెళ్లి హెలికాప్టర్ ఎక్కారు. అక్కడి నుంచి ఖమ్మం జనగర్జన సభకు బయలుదేరారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా భావిస్తున్న భారీ బహిరంగ సభ ‘జన గర్జన’ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ గ్రౌండ్స్‌లో 150 ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడే ముగియనుండడం, జన గర్జన సభలోనే ఖమ్మం జిల్లా కీలక నేతలు పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనుండడంతో ఈ బహిరంగ సభ ప్రాధాన్యం సంతరించుకుంది.