బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈవీఎంలపై విపక్షాలతోపాటు.. ప్రజలకు నమ్మకం పోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ప్రపంచవ్యాప్తంగా పోలింగ్ కు బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తుంటే మనదేశంలో మాత్రం ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.కేరళలోని వయనాడ్ లో ఎన్నిప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. గత పదేళ్లుగా వారణాసి ఎంపీ దేశానికి ప్రధానిగా ఉన్నారన్నారు. రాబోయే 20ఏళ్లు వయనాడ్ ఎంపీయే ప్రధానిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
అవినీతికి ప్రధాని నరేంద్ర మోదీ చాంపియన్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు . ఎలక్టోరల్ బాండ్స్ పారదర్శకత కోసమే తెచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారని, అదే నిజమైతే సుప్రీంకోర్టు ఈ వ్యవస్థను ఎందుకు రద్దు చేసిందని ఆయన ప్రశ్నించారు. పారదర్శకత ఉంటే ఎలక్టోరల్ బాండ్స్ కొన్న వారిని, ముఖ్యంగా బీజేపీకి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ పథకమని రాహుల్ గాంధీ మండిపడ్డారు.