దసరా పండుగకు రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బ్యాడ్ న్యూస్ చెప్పింది. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దసరా పండుగ సందర్భంగా.. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో రద్దీ ఇంకా ఎక్కువవుతోంది.
రైల్వే స్టేషన్లలో రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేసింది. పెంచిన ధరలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు అమలు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాచిగూడ రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫాం టికెట్ ధర రూ. 20 పెంచుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
మరోవైపు దసరా పండుగ పూట తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త చెప్పింది. ప్రతి ఏడాది లాగా కాకుండా ఈ ఏడాది దసరా పండుగకు ఛార్జీలు పెంచకుండా సాధారణ ఛార్జీలే వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.