విశాఖ వచ్చి అమరావతిలో కాపిటల్ అంటే, అక్కడి వారు ఎలా సహిస్తారు..ఎదురుదాడి తప్పదు ! – బొత్స

-

అమరావతి పాదయాత్ర పై మరో సారి మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము తలుచుకుంటే 5 నిమిషాల్లో పాదయాత్ర ఆపుతాం అని నెను నిన్న అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని.. జరుగుతుంది రైతుల పాదయాత్ర కాదు రియల్ ఎస్టేట్ యాత్ర అన్నారు. ఇక్కడ వారు అక్కడ అభివృద్ధి ని అడ్డుకుంటే చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతి లో జరిగింది.. రెండు మూడు ఛానెల్స్ నాపై ప్రచారం చేస్తే నేను బెదరనని ఛాలెంజ్‌ చేశారు.

ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే నేను అసలు భయపడనని.. యాత్రను ఎలా ఆపగలమో ముందు ముందు చూస్తారన్నారు. ముందే చెప్పి చేయము.. వాక్ స్వాతంత్ర్య ఇచ్చారని ఏది బడితే అది మాట్లాడ కూడదని… విశాఖ వచ్చి పరిపాలన రాజధాని వద్దు అంటే అక్కడి వారు ఊరుకుంటారా అని ఆగ్రహించారు. నాగార్జున సాగర్, పోలవరం నిర్వాసితులది త్యాగమని.. అమరావతి రైతులకు ప్రభుత్వం అనేక మేలు చేసిందని తెలిపారు. దానిని త్యాగం అని ఎలా అంటారని.. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని మేమే ఎక్కడ ఉల్లంగించలేదని తేల్చి చెప్పారు. ముల్లు వచ్చి అరిటకు మీద పడిన, అరిటకు వెళ్లి ముల్లు మీద పడిన అరిటకుకే నష్టమేనని.. అందుకే ప్రభుత్వం గా చాలా సంయమనం తో మాట్లాడుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news