ప్రభుత్వ భూమిలో ఆలయం ఉందని ఏకంగా దేవుడికే నోటీసులిచ్చిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. హనుమంతుడి పేరు మీద విడుదలైన ఈ నోటీసులో.. రైల్వే శాఖకు చెందిన భూమిని ఆక్రమించారని అధికారులు పేర్కొన్నారు. మురైనా జిల్లాలోని సబల్‌గఢ్‌లో అధికారులు కొత్తగా రైల్వేలైన్‌ను నిర్మిస్తున్నారు.
గ్వాలియర్-షియోపుర్ మధ్య ఏర్పాటు చేస్తున్న ఈ లైన్లో ఓ హనుమాన్ ఆలయం ఉంది. ఆ గుడి.. రైల్వే శాఖకు చెందిన భూమిలో ఉందని.. అందుకే ఈ నోటీసులు జారీ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే శాఖకు చెందిన భూమిని హనుమంతుడు ఆక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు.
‘‘ఝాన్సీ రైల్వే డివిజన్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఫిబ్రవరి 8న ఈ నోటీసు జారీచేశారు. వాస్తవానికి ఆలయ యజమానికి నోటీసు ఇవ్వాలి. కానీ పొరపాటున హనుమంతుడి పేరుతో నోటీసు ఇచ్చారు’’ అని ఝాన్సీ రైల్వే డివిజన్ పీఆర్‌వో మనోజ్ మాథుర్ తెలిపారు.