బెంగళూరు శివారు యలహంకలో నేటి నుంచి ఏరో ఇండియా-2023 ప్రదర్శన ప్రారంభం కానుంది. ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరిట ఈ ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఇందుకోసం ప్రధాని ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నారు.
ఇది ఆసియాలోనే అతి పెద్ద వైమానిక ప్రదర్శనగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ‘భారత్‌లో తయారీ- ప్రపంచ కోసం తయారీ’ అనే లక్ష్యాలతో రూపొందించిన భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయన్నారు. 32 దేశాల రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొంటారని తెలిపారు.
17వరకు నిర్వహించే కార్యక్రమంలో రూ.75 వేల కోట్ల ఒప్పందాలు చేసుకోవడానికి వీలుందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. కార్యక్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, అమెరికా కాన్సులేట్ రాయబారి ఎలిజబెత్ జోన్స్, అధికారులు జేడ్డీ పీ రాయల్, మేజర్ జనరల్ జులియన్ సీ చీటర్, రేర్ అడ్మిరల్ మైఖేల్ బాకర్ ఉన్నారు.