రైల్వే శుభవార్త.. ₹ 7,140తో దక్షిణ భారత్ యాత్ర టూర్ ప్యాకేజ్

దక్షిణ భారత్ యాత్ర పేరుతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) పర్యాటక ప్యాకేజీ ప్రకటించింది. డిసెంబర్ 12న ఈ యాత్రా రైలు సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది మొత్తం ఆరు రోజుల పాటు సాగే ఈ టూర్ 18 వరకు ఉంటుంది. 7,140 రూపాయల ప్యాకేజీ లోనే ప్రయాణం, వసతి, భోజనం ఏర్పాట్లు చేయనుంది రైల్వే.

సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట ప్రాంతాలలో కూడా ప్రయాణికులు ఎక్కవచ్చు. ఇక ఈ రూట్ లో వచ్చే తిరుచిరాపల్లి, తంజావూర్, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, ప్రాంతాలలో పర్యాటక ప్రదేశాలు, ఆలయాలను దర్శించ వచ్చని రైల్వే తెలిపింది. కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యాత్ర సాగుతుందని పేర్కొంది. అలానే ఆన్ లైన్ ద్వారా కూడా బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.