టికెట్ రిజర్వేషన్లపై రైల్వే కీలక ప్రకటన

-

రైలు టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. రిజర్వేషన్ రెండో చార్ట్ ప్రిపేర్ చేసే మళ్ళీ సమయాన్ని పాత పద్ధతికి తీసు కొచ్చింది. గతంలో రైలు బయలుదేరడానికి 30 నిమిషాల నుంచి 5 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేసే వారు. అయితే దేశంలో కరోనా వైరస్ ఎంటర్ అయిన నాటి నుండి కారణంగా దాన్ని గతంలో 2 గంటల ముందుకు మార్చారు.

అయితే ఇది అంత సరిగా లేదని వివిధ జోనల్ రైల్వేల నుంచి విజ్ఞప్తులు రావడంతో దాన్ని మళ్లీ పాత పద్ధతికి తీసు కొచ్చారు. అయితే దీని వల్ల ప్రయాణికులకు మరిన్ని టికెట్లు బుక్ చేసుకునే వెసులు బాటు కలుగుతుంది. ముఖ్యంగా చివరి నిమిషంలో రైలు రిజర్వేషన్ కోసం చూసే వారికి ఇది సౌకర్యంగా ఉంటుంది. అయితే మళ్ళీ రైళ్ళు పునరుద్ధరించే అంశం మీద అయితే ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికి అయితే చాలా తక్కువ సంఖ్యలో రైళ్ళను ఆపరేట్ చేస్తోంది రైల్వే.

Read more RELATED
Recommended to you

Exit mobile version