ఈ ఏడాది మొదట్లో రైల్వేలోని 1.4 లక్షల పోస్టులని భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించగా ఏకంగా 2.42 కోట్ల దరఖాస్తులు వచ్చి పడ్డాయట. దీంతో ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి భారతీయ రైల్వే 1.4 లక్షల పోస్టులకు గాను పరీక్షలు మొదలు పెడతామని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వేలోని వివిధ విభాగాలలో నియామకం కోసం మేము దరఖాస్తులను ఆహ్వానించామని కోవిడ్ పీరియడ్ కి ముందే వీటికి నోటిఫికేషన్ జరీ చేశామని రైల్వే బోర్డ్ సిఇఒ వికె యాదవ్ విలేఖరుల సమావేశంలో చెప్పారు.
ఈ 1.4 లక్షల ఉద్యోగాలకి గాను 2.42 కోట్ల దరఖాస్తులు వచ్చాయని సీఈఓ తెలిపారు. ఈ దరఖాస్తులు అన్నీ వ్యాలిడ్ అయ్యాయన్న ఆయన కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, కంప్యూటర్ మీద పరీక్షలను పెట్టలేమని అన్నారు. ఈ పరీక్షలను డిసెంబర్ 15 నుంచి మూడు విడతల్లో నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఇక ఈ పరీక్షల కోసం షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు యాదవ్ తెలిపారు.