ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా… రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ… ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉండటంతో వాతావరణంలో తీవ్ర అనిశ్ఛితి ఏర్పడిందని తెలిపింది. దానికితోడు ఎండ తీవ్రత పెరగడంతో మేఘాలు ఆవరించి పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే నిన్న కూడా ఏపీ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. దాంతో లోతట్టు ప్రాంతాల్లోని భారీగా వరద నీరు చేరింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన వర్షాలతో నదులు వాగులు వంకలు నీటితో నిండిపోయాయి. దాంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగానే నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఓవైపు చలి గాలులు వీస్తూ ఉంటే మరోవైపు వర్ష సూచన ప్రజలను ఆందోళన కలిగిస్తోంది.