ఏపీ సీఎం ను పట్టుకుని ఆ భూతులేంటి..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!

ఏపీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ బూతులు ఏంటని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం.. హుజరాబాద్ ఉప ఎన్నిక తదితర అంశాలపై కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మహారాష్ట్ర సీఎంను దూషించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు చూస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో కూడా సీఎంను పట్టుకుని కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో డిగ్నిటీ ఉండాలని కేటీఆర్ హితవు పలికారు. ఏపీలో ఒక సంఘటన జరిగిందని సీఎం ను పట్టుకుని ఆ బూతులు ఏంటి అని వ్యాఖ్యానించారు.

టిడిపి కార్యాలయం పై జరిగిన దాడిని పక్కన పెడితే దానికి మూలం ఎక్కడ ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అసహనం ఎందుకు అని.. నువ్వు ఓడిపోయావు ఐదేళ్ల తర్వాత మళ్లీ జనం లోకి వెళ్ళు బతిమిలాడుకో నీకు ఎందుకు ఓటు వేయాలో వివరించు.. అర్జెంట్గా అధికారంలోకి రావాలన్న ఆరాటం ఎందుకని ప్రతిపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు అధికారాన్ని వేరొకరికి ఇచ్చారని మమ్మల్ని కూడా 2009లో తిరస్కరిస్తే మళ్లీ 2014లో అధికారంలోకి వచ్చామని కేటీఆర్ అన్నారు.