దారుణం..బట్టలు కొంటామని వచ్చి గొంతులు కోశారు..!

బెంగుళూరు హోస పేట లో దారుణం చోటు చేసుకుంది. పక్క ప్లాన్ ప్రకారం వచ్చిన దుండగులు ఇద్దరు మహిళల గొంతు కోసి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన లో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళితే…. రాణి పేట లో నివాసం ఉంటున్న అక్కా చెల్లెళ్ళు భువనేశ్వరి (58),శివ భూషణ (56) ఇంట్లో దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. గురువారం ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. శుక్రవారం వచ్చి చీరలు కొంటామని చెప్పి వెళ్లారు. మళ్లీ శుక్రవారం ఇంటికి వచ్చారు.

మహిళలు దుస్తులు చూపిస్తుంటే కొన్నట్టు నటించారు. అదును చూసి మహిళల పై కత్తుల తో దాడి చేశారు. ఇద్దరు మహిళల గొంతు కోసి వారి వద్ద ఉన్న బంగారం, నగలు ఎత్తుకెళ్లారు. కాగా ఓ మహిళ మృతి చెందగా…మరో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం 5గురు దుండగులు మహిళల ఇంటికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.