ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ తుఫాన్ హెచ్చరికలు జారీచేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది శుక్రవారం సాయంత్రం పూరీకి 590 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయం గా కళింగ పట్నానికి 740 కిలోమీటర్లు తూర్పుగా కేంద్రీకృతం అయ్యింది. అయితే ఇది శనివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఆదివారం నాటికి తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. 24గంటల్లో పశ్చిమ వాయివ్యంగా పయనించి దక్షిణ ఒడిసా లోని గోపాల్ పూర్ ఉత్తర కోస్తాలో విశాఖపట్నం మధ్య కలింగపట్నానికి సమీపం లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
దాని ప్రభావం తో ఒడిస్సా, తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ. వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక ఏపిలో శ్రీకాకుళం విజయనగరం ఉభయగోదావరి విశాఖపట్నం లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దాంతో ఏపి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.